‘భాగమతి’ సీక్వెల్ తీస్తామని హింట్ ఇచ్చారు గమనించారా

updated: February 28, 2018 13:13 IST
‘భాగమతి’  సీక్వెల్  తీస్తామని  హింట్ ఇచ్చారు గమనించారా

హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయటం కొత్తేమీ కాదు. అలాగే తమ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉన్నప్పుడు... ఆ టీమ్ ..సినిమా చివరలో ..సీక్వెల్ కు సిద్దం అన్నట్లుగా చిన్న క్లూ వదలటం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడో టైమ్ తీసుకుని సీక్వెల్  ప్లాన్ చేస్తూంటారు. సీక్వెల్ తో ఓ సుఖం ఏమిటంటే...మొదటి సినిమా హిట్ క్రేజ్ తో వెంటనే బిజినెస్ అయ్యిపోతుంది.అలాగే తొలి సినిమా చూసిన ప్రేక్షకులు..ఈ సీక్వెల్ ఎలా తీసారో చూద్దామని బయిలు దేరతారు. ఇప్పుడు అదే కోవలో అనుష్క హీరోయిన్ గా వచ్చిన భాగమతి కు కూడా సీక్వెల్ క్లూ వదిలారు. ఆ విషయం సినిమా ఎండింగ్ టైటిల్స్ సరిగ్గా గమనిస్తే అర్దమవుతుంది.

 

భాగమతి ..ఎండింగ్ టైటిల్స్ లో ...అనుష్క ఆడిన డ్రామా అంతా విప్పి చెప్పేస్తారు. ఆమె భాగమతిగా డ్రామా ఆడేందుకు ఉన్న అవకాశాలు, ఎలా డ్రామా ఆడిందనే విషయం వివరణ ఇచ్చేసారు. అయితే అనుష్క పాత్రకు ఉర్దూ రాదు. కానీ ఆమె నిజాం కాలం నాటి ఉర్దూ ఫ్లాష్ బ్యాక్ లో మాట్లాడుతుంది. ఇదే ప్రశ్న చివర్లో అనుష్క పాత్ర ని అడిగితే..అబ్బే నాకు ఉర్దూ రాదని అంటుంది. మరి అలాంటప్పుడు ఆమె ఎలా మాట్లాడింది. అంటే అక్కడ నిజంగానే భాగమతి దెయ్యం ఉందేమో అనే సందేహం కలిగించారు.ఇక్కడ కెమరాని మరల కోటల ోకి తీసుకెళ్లి చూపించారు. అది చాలా మంది నోటీస్ చేసి ఉండరు . కానీ అది ఖచ్చితంగా సీక్వెల్ కు క్లూనే అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్దమవుతుంది

comments